మొదటి రోజు స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ఇంకా స్ట్రాంగ్ గా ఉన్న గద్దలకొండ గణేష్ సినిమాకి పెట్టిన పెట్టుబడి వెంటనే వచ్చే అవకాశముందని అర్ధం అవుతుంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈమూవీ నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మూవీలో వరుణ్ పాత్ర గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే వరుణ్ తో పాటు సమానంగా నడిచిన అథర్వా పాత్ర గురించి మాత్రం సంతృప్తి వ్యక్తం కాలేకపోతోంది.
ఎందుకంటే అధర్వ తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేడు. పైగా మనోడు తమిళ నటుడు అని చాలామందికి తెలియదు. ఏదో బయట నుండి తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు. సినిమాలో కీలక పాత్ర అయిన అధర్వని తీసుకోవడం కొంత మైనస్ గానే నిలిచింది. సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. అతని ప్లేస్ లో తెలుగు హీరోని తీసుకుని ఉంటే బాగుండేది. కానీ హరీష్ అలా చేయలేదు.
అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే హరీష్ అధర్వ పాత్ర విషయంలో రాజీ పడినట్టుగా కనిపిస్తోంది. దానికి తోడు అధర్వ పాత్రకు డబ్బింగ్ చెప్పిన హేమచంద్ర వాయిస్ అసలు సూట్ కాలేదు. హరీష్ అధర్వ పాత్ర కోసం అప్పటికే మన తెలుగు హీరోస్ ఇద్దరు ముగ్గురిని సంప్రదించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.