ఆ మధ్య నాని హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ కథ మొదట రామ్ చరణ్‌కి వినిపించాడు గాంధీ. రామ్ చరణ్ కి కథ నచ్చకపోవడంతో ఆ కథను నేను చేస్తానని నాని చేసి బొక్కబొర్లా పడ్డాడు. తన కెరీర్ లోనే ఈమూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో నాని జాగ్రత్త పడుతున్నాడనే టాక్ వచ్చింది.. కానీ పడలేదు. రెండోసారి కూడా అదే తప్పు చేసాడు.
రీసెంట్‌గా రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ కథ అల్లు అర్జున్ ది. బన్నీకి విక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో సెకండ్ హాఫ్ మార్పులు చేసి తీసుకుని రమ్మన్నాడు. బన్నీకి ఎన్ని వెర్షన్స్ వినిపించినా ఒప్పుకోలేదు. దాంతో ఆ కథ అలా నాని వద్దకు వచ్చింది. నాని ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పేసి చేసేసాడు. దాంతో ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వీక్ అని అర్ధం అయిపోతుంది.
ఆడవాళ్ల తరఫు రివెంజ్ అంటూ మొదలు పెట్టి వారిపై ఎలాంటి సానుభూతి కలగకుండా చేసి, విలన్‌ని కూడా వీక్ చేసేయడంతో సినిమా పల్టీ కొట్టింది. దాంతో నాని మరోసారి గ్యాంగ్ లీడర్‌తో నిరాశపరిచాడు. ఇకనైనా నాని ఎవరైనా వదిలేసిన స్క్రిప్ట్స్ జోలికి పోకుండా ఉంటే చాలని, తన దగ్గరకు డైరెక్ట్‌గా వచ్చిన కథలలో మంచి వాటిని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే చాలని, తన మార్కెట్ స్ట్రాంగ్ అవుతుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.