వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) చిత్రం ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మొదటి రోజు ఈమూవీ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సింగిల్ స్క్రీన్స్‌లో ఈమూవీకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతుంటే ఏదో పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. రివ్యూస్‌తో సంబంధం లేకుండా ఈమూవీ థియేటర్స్ లో సందడి చేస్తుంది.
వరుణ్ తేజ్ ఇప్పటివరకు క్లాస్ సినిమాలే చేసాడు. మొదటిసారి ఊర మాస్ సినిమా చేయడంతో అందరి చూపు తనపై పడింది. ముఖ్యంగా వరుణ్ లుక్ సినిమాకి హైలైట్ గా నిలించింది. హరీష్ శంకర్ కమర్షియల్ మసాలాలన్నీ బాగా దట్టించడంతో మాస్ ప్రేక్షకులు సినిమా కోసం ఎగబడిపోయినట్లే ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఈమూవీ ఉండడంతో ప్రేక్షకులు ఈసినిమానే చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దాంతో గత వారం రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ సైడ్‌కి తప్పుకుంది.
లాస్ట్ మినిట్‌లో సినిమా టైటిల్ మార్పుతో ప్రేక్షకుల్లో ఒక రకమైన సానుభూతి ఏర్పడినట్లే ఉంది. ఆ విధంగా పబ్లిసిటీకి కూడా బాగానే పనికొచ్చింది. సోలోగా వరుణ్ తేజ్ తన పాత చిత్రాల అన్ని రికార్డ్స్ ఈచిత్రంతో చెరిపేస్తారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.