తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. త్వరలోనే వీరాభిమానులు, సినీ ప్రియుల ముందుకు సినిమా రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని సినిమా యూనిట్ భావించింది. అందుకే ఇప్పటికే చిరుపుట్టిన రోజు పురస్కరించుకని మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు.. సినిమా క్లైమాక్స్‌పై కాసింత క్లూ కూడా ఇచ్చేశారు.
వాస్తవానికి ఉయ్యాల వాడ నర్సింహ రెడ్డి రియల్ లైఫ్‌లో బ్రిటిషర్స్ చాలా దారుణంగా హింసించి చివరికి ఉరి తీసి తలను వేలాడదీశారు.. ఇది నర్సింహ రెడ్డి చరిత్రలో ఓ భాగం. అక్కడితో ఆయన కథ ముగిసింది. ఇక రీల్‌లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మెగాభిమానుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న. అయితే ట్రైలర్ లాంచ్ వేదికగా అనుమానాలన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.
‘ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిది చారిత్రాత్మక సినిమా గనుక ఆయన జీవితంలో జరిగిన విషయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయనను ఉరితీసి ముప్పై ఏళ్ల పాటు అలానే తాడుకు వేలాడదీశారు. అంటే.. బ్రిటిష్ వాళ్ళని ఆయన ఎంతగా భయపెట్టారన్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉయ్యాలవాడ జీవితంలో జరిగిన విషాదమే ఆయన సాధించిన గొప్ప విక్టరి. సో సినిమా సాడ్ ఎండింగ్‌తో ముగిసినా అక్కడ్నుంచే అసలు యుద్ధం మొదలయింది’ సురేందర్ చెప్పుకొచ్చారు. మరి ఈ క్లైమాక్స్ జనాలకు ఏమాత్రం అర్థమవుతుందో మరి.