కుర్ర హీరోలూ.. ఆ ముగ్గుర్నీ ఫాలో అవ్వండి!
TSR Suggestion To Tollywood Young Heros!టాలీవుడ్ కుర్ర హీరోలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీనిర్మాతగా పేరుగాంచిన టి. సుబ్బిరామిరెడ్డి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. సెప్టెంబర్ 17తో ఆయన 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కళాకారులు అంటే ఎలా ఉండాలి..? ఎవర్ని ఫాలో అవ్వాలి..? అనే ప్రశ్నకు టీఎస్సార్ చాలా లాజిక్‌గా బదులిచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా కుర్రహీరోలకు సలహాలిచ్చారు. ఏ హీరో అయినా.. సుదీర్ఘకాలం మెప్పు పొందాలి అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పుకొచ్చారు. ఇందుకు చక్కటి ఉదాహరణ.. ఏఎన్నార్, ఎన్టీఆరేనని.. దశాబ్ధాల పాటు ఆ ఇద్దరు ఓ వెలుగు వెలిగారంటే వారిలోని క్రమశిక్షణ, ఒదిగి ఉండే స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండటమేనని టీఎస్సార్ తెలిపారు.
అందుకే చిరు కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్‌నే అనుసరిస్తారు.. అందుకే ఈ జనరేషన్‌కు ఆయనే సూపర్‌స్టార్ అయ్యారని తన మనసులోని మాటను టీఎస్సార్ చెప్పారు. అందుకే.. ఈ జనరేషన్ అంతా ఎన్టీఆర్- ఏఎన్నార్-చిరంజీవీ ఈ ముగ్గుర్నీ ఫాలో అవ్వాలని టీఎస్సార్ సూచించారు. మరి ఇప్పుడున్న కుర్ర హీరోలు పెద్దలను ఏ మాత్రం ఫాలో అవుతారో..? టీఎస్సార్ వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.
TSR Suggestion To Tollywood Young Heros!






































