టాలీవుడ్ కుర్ర హీరోలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీనిర్మాతగా పేరుగాంచిన టి. సుబ్బిరామిరెడ్డి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. సెప్టెంబర్ 17తో ఆయన 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కళాకారులు అంటే ఎలా ఉండాలి..? ఎవర్ని ఫాలో అవ్వాలి..? అనే ప్రశ్నకు టీఎస్సార్ చాలా లాజిక్‌గా బదులిచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా కుర్రహీరోలకు సలహాలిచ్చారు. ఏ హీరో అయినా.. సుదీర్ఘకాలం మెప్పు పొందాలి అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పుకొచ్చారు. ఇందుకు చక్కటి ఉదాహరణ.. ఏఎన్నార్, ఎన్టీఆరేనని.. దశాబ్ధాల పాటు ఆ ఇద్దరు ఓ వెలుగు వెలిగారంటే వారిలోని క్రమశిక్షణ, ఒదిగి ఉండే స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండటమేనని టీఎస్సార్ తెలిపారు.
అందుకే చిరు కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్‌నే అనుసరిస్తారు.. అందుకే ఈ జనరేషన్‌కు ఆయనే సూపర్‌స్టార్ అయ్యారని తన మనసులోని మాటను టీఎస్సార్ చెప్పారు. అందుకే.. ఈ జనరేషన్ అంతా ఎన్టీఆర్- ఏఎన్నార్-చిరంజీవీ ఈ ముగ్గుర్నీ ఫాలో అవ్వాలని టీఎస్సార్ సూచించారు. మరి ఇప్పుడున్న కుర్ర హీరోలు పెద్దలను ఏ మాత్రం ఫాలో అవుతారో..? టీఎస్సార్ వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.