Advertisementt

రానాకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!

Thu 19th Sep 2019 02:42 AM
rana daggubati,kajal aggarwal,nene raju nene mantri,nandini reddy  రానాకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!
will kajal acts again with rana రానాకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!
Advertisement
Ads by CJ

దగ్గుబాటి రానా హీరోగా.. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి నందినీ రెడ్డి సిద్ధమయ్యారు. వాస్తవానికి ప్రస్తుతం క్రైమ్ నేపథ్యంలో ఉన్న సినిమాలే చాలా వరకు సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. అందుకే అదే బాటలోనే తాను నడవాలని భావించిన నందిని.. ఒక కొరియన్ సినిమా రీమేక్‌కు ఫిక్సయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను రానా సొంతం చేసుకున్నారట. 

ఇప్పటి వరకూ అంతా ఓకే గానీ.. రానా సరసన నటించేదెవరు..? టాలీవుడ్‌లో నటించిన భామలే సరిపోతారా..? లేకుంటే బాలీవుడ్ పట్టుకురావాలా..? అనే యోచనలో పడ్డారట నందిని. ఈ క్రమంలో కాజల్ అయితే కరెక్టుగా సరిపోతుందని భావించారట. అందుకే ప్రస్తుతం ఆమెకు కథ చెప్పి.. ఒప్పించే పనిలో పడ్డారట. అయితే ఈ చిత్రాన్ని రానానే స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడట. 

కాగా.. ఇప్పటికే రానా సరసన నాయికగా గతంలో కాజల్  చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి ఫలితాన్నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే టాక్ కూడా అప్పట్లో గట్టిగానే వచ్చింది. అందుకే కాజల్‌నే మళ్లీ ఈ సినిమాలో అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేకుంటే సింపుల్‌గా కుదరదు అని మిన్నకుండిపోతుందో వేచి చూడాల్సిందే మరి.

will kajal acts again with rana:

will kajal acts again with rana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ