Advertisementt

మెగా బ్రదర్స్‌తో సినిమాపై టీఎస్సార్ క్లారిటీ!

Wed 18th Sep 2019 10:41 PM
t subbarami reddy,mega heroes,chiranjeevi,pawan kalyan,movie,tsr,birthday  మెగా బ్రదర్స్‌తో సినిమాపై టీఎస్సార్ క్లారిటీ!
T Subbarami Reddy About Movie with Mega Heroes మెగా బ్రదర్స్‌తో సినిమాపై టీఎస్సార్ క్లారిటీ!
Advertisement
Ads by CJ

మెగా బ్రదర్స్‌తో కచ్చితంగా సినిమా తీస్తానని అప్పట్లో పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీనిర్మాతగా పేరుగాంచిన టి. సుబ్బిరామిరెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉండటంతో ఇద్దరూ టీఎస్సార్‌కు షెడ్యూల్స్ ఇవ్వలేకపోయారు. దీంతో సినిమా తీయాలన్న ఆయన కోరిక తీరలేదు. అంతేకాదు.. ఇప్పట్లో సినిమా ఉండదనే అందరూ భావించారు. అయితే తాజాగా మరోసారి మెగాబ్రదర్స్‌‌తో సినిమాపై టీఎస్సార్ పెదవి విప్పారు.

ఇటీవల మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన టీఎస్సార్‌కు మీడియా మిత్రుల నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదరువ్వగా.. ఆయన చాలా లాజిక్‌గా బదులిచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి-పవన్‌తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కిస్తారు..? అని అడగ్గా.. అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో సినిమా చేయడం కుదరలేదన్నారు. అయితే ఇప్పుడు చిరు రెడీగా ఉన్నానని ఒక్కమాట చెబితే చాలు సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే మెగా ఫ్యాన్స్‌కు ఇది ఎగిరి గంతేసే వార్తేనని చెప్పుకోవచ్చు. మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..!

అంతటితో ఆగని ఆయన.. తనలో ఉన్న నిర్మాతను బయటపెట్టారు. తాను సినిమాలతో డబ్బులు సంపాదించనని.. బిజినెస్‌లో మాత్రమే సంపాదిస్తానన్నారు. సినిమాలు తీసి సంపాదించే నిర్మాతలు చాలా తక్కువమంది ఉన్నారని.. నిర్మాతలకు డబ్బులు రావని టీఎస్సార్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఏఎన్నార్, చిరంజీవి సహా నేటితరం హీరోలతోనూ ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17తో ఆయన 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిట్‌చాట్‌లో ఈ ఆసక్తికర విషయాలను టీఎస్సార్ పంచుకున్నారు.

T Subbarami Reddy About Movie with Mega Heroes:

T Subbarami Reddy Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ