మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓ స్వాతంత్ర్య సమర యోధుడు పాత్రలో నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ మూవీ రిలీజ్ అవ్వడం విశేషం.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ టీవీ ఛానల్, జీ టీవీ ఈ చిత్రం యొక్క శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ను 125 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత అమౌంట్ పెట్టి చిరు సినిమా తీసుకోవడం ఇదే మొదటిసారి. పైగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం ఈ మూవీ యొక్క ట్రైలర్ కోసం చిరు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు (సెప్టెంబర్ 18) జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 22 కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. చిరుకి జోడిగా నయనతార నటిస్తుంది.