Advertisementt

‘వాల్మీకి’ భారం మొత్తం వరుణ్ తేజ్ పైనే!

Wed 18th Sep 2019 10:02 PM
varun tej,valmiki,harish shankar,varun tej movie,pooja hegde  ‘వాల్మీకి’ భారం మొత్తం వరుణ్ తేజ్ పైనే!
Valmiki Movie Ready to Release ‘వాల్మీకి’ భారం మొత్తం వరుణ్ తేజ్ పైనే!
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ తరువాత అంతటి హిట్ అందుకోవడానికి ఏ సినిమా రాలేదు. అందుకే ఇప్పుడు అందరు వాల్మీకి చిత్రం కోసం చూస్తున్నారు. ట్రైలర్ మాంచి కిక్ ఇచ్చే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. ఇది ఒక రీమేక్ చిత్రం అని అందరికి తెలిసిన విషయమే. ఇందులో వరుణ్ తేజ్ రెండు షేడ్స్ తో కనిపించనున్నాడు. తమిళ్‌లో సిద్దార్థ చేసిన పాత్రలో తమిళ హీరో అథర్వ చేయనున్నాడు.

మెయిన్‌గా స్టోరీ మొత్తం అధర్వ-మృణాళిని మధ్యే జరగనుంది. కాకపోతే వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేరు. మరి వీరి పాత్రలని హరీష్ ఎలా హేండిల్ చేసాడు అనేది చూడాలి. దానికి తోడు పూజా ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించదట. కేవలం ఆమెది క్యామియో లాంటి పాత్రేనని హరీష్ చెప్పడం తన ఫ్యాన్స్ ని ఎంతలేదన్నా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో బరువు మొత్తం వరుణ్ తేజ్ మీద పడింది.

మరి వరుణ్ తేజ్ పాత్రకు ఎంత మంది కనెక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటివరకు వరుణ్ సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు. సడన్ గా విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. మరి ప్రేక్షకులు యాక్సెఫ్ట్ చేస్తారా? లేదా? చూడాలి. భారీ అంచనాలతో ఈనెల 20న రిలీజ్ అవుతున్న ఈసినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

Valmiki Movie Ready to Release:

Varun Tej Highlight in Valmiki Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ