Advertisementt

విజయ్.. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ అంట!

Tue 17th Sep 2019 10:52 PM
vijay devarakonda,world famous lover,first look  విజయ్.. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ అంట!
Vijay Devarakonda Is World Famous Lover First Look విజయ్.. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ అంట!
Advertisement
Ads by CJ

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా టైటిల్‌ ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’

సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రానికి ‘వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ సెన్సిబుల్ క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 20, సాయంత్రం 5 గంట‌ల‌కు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  క్రాంతి మాధ‌వ్‌

నిర్మాత‌:  కె.ఎ.వ‌ల్ల‌భ‌

స‌మ‌ర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

కెమెరా:  జ‌య‌కృష్ణ గుమ్మ‌డి

ఆర్ట్‌:  సాహి సురేశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Vijay Devarakonda Is World Famous Lover First Look:

Vijay Devarakonda Is World Famous Lover

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ