Advertisementt

సందీప్ వంగా నెక్స్ట్ టైటిల్ ఇదేనా?

Tue 17th Sep 2019 08:21 PM
sundeep vanga,devil,bollywood,kabir singh,arjun reddy director  సందీప్ వంగా నెక్స్ట్ టైటిల్ ఇదేనా?
Sundeep Vanga Next Film Title Revealed సందీప్ వంగా నెక్స్ట్ టైటిల్ ఇదేనా?
Advertisement
Ads by CJ

‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా టాలీవుడ్ నుండి కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం పెట్టడమే ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సందీప్ వంగాని తెలుగు హీరోలు నమ్మకపోయినా... బాలీవుడ్ హీరోలు మాత్రం ఇప్పట్లో వదిలేలా లేరు. అందుకే సందీప్ వంగా.. కబీర్ సింగ్ తర్వాత తన నెక్స్ట్ మూవీని కూడా బాలీవుడ్ లో చెయ్యబోతున్నాడు. అక్కడ స్టార్ హీరోస్‌లో ఒకడైన రణబీర్ కపూర్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడట సందీప్.

ఇప్పటికే వారి మధ్య కథా చర్చలు పూర్తయినట్లుగా చెబుతున్నారు. ఇక బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డిలో హీరోకి మల్లే.... హీరో పాత్రకి  కాస్త నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. అందుకే ఆ సినిమా టైటిల్ కూడా కాస్త నెగటివ్‌గా ఉండబోతుందని... అది కూడా డెవిల్ అంటూ... సందీప్ వంగా నెక్స్ట్ బాలీవుడ్ టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ తెర మీదకొచ్చింది. హీరోకున్న నెగెటివ్ షేడ్స్‌కి ఈ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుందని.. అందుకే ఈ టైటిల్‌కే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే మొదలు కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి డిటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

Sundeep Vanga Next Film Title Revealed:

Sundeep Vanga next Bollywood Film is Devil

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ