Advertisementt

మహేశ్‌తో సాంగ్‌కు బాలీవుడ్ బ్యూటీ కండిషన్స్!

Tue 17th Sep 2019 01:24 PM
bollywood beauty,mahesh babu,sonakshi sinha,sarileru neekevvaru  మహేశ్‌తో సాంగ్‌కు బాలీవుడ్ బ్యూటీ కండిషన్స్!
Bollywood Beauty Says No To Mahesh! మహేశ్‌తో సాంగ్‌కు బాలీవుడ్ బ్యూటీ కండిషన్స్!
Advertisement
Ads by CJ

ఇదేంటి.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ సరసన నటించిన నటీమణులు క్యూలో ఉంటారు కదా.. నో చెప్పిన ఆ దురదృష్టవంతురాలు ఎవరబ్బా..? అని ఇటు టాలీవుడ్‌లో.. అటు బాలీవుడ్ నటీనటులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు..? మహేశ్‌తో ఏ సినిమాలో నటించడానికి ఆ భామను అడిగారు..? ఆమె ఎందుకు నో చెప్పింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వరు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. స్పెష‌ల్ సాంగ్‌ ఎవరితో చేయిస్తే బాగుంటుంది..? బాలీవుడ్ నుంచి భామను రప్పిద్దామా..? లేకుంటే టాలీవుడ్ ముద్దుగుమ్మతో సరిపెట్టుకుందామా..? అని ఆలోచించగా.. మొదట సోనాక్షి సిన్హాను అనుకొని ఆమెను సంప్రదించారట. అయితే ఆమెను సంప్రదించగా టక్కున ఓకే చెప్పేసిందట.

ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ముందు సాంగ్ పంపాలని కండిషన్స్ పెట్టిందట. పూర్తి సాంగ్ పంపితేనే నర్తిస్తానని తేల్చిచెప్పిందట. వాస్తవానికి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చివర్లో ఈ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఆమె కండిషన్స్‌కు నో చెప్పేసిన దర్శక నిర్మాతలు.. మిల్క్ బ్యూటీ తమన్నా సంప్రదించడం.. అడ్వాన్స్‌లు ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. అయితే.. ఇటీవల తమ్మూ కాదు పూజా హెగ్దే అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఫైనల్‌‌గా మహేశ్ సరసన స్పెషల్ సాంగ్‌లో నర్తించే ఆ భామ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Bollywood Beauty Says No To Mahesh!:

Bollywood Beauty Says No To Mahesh!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ