మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది. ఇక బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను చిత్రీకరిస్తున్న చిత్ర బృందం, తాజాగా గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా డిస్కో రాజా టీం చెబుతుంది. ఈ నేపథ్యంలో గోవా షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్ లోని ఐస్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించడానికి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా డిస్కో రాజా టీం చెబుతుంది.
నాలుగు నిముషాల సన్నివేశం కోసం 4 - 5 కోట్ల ఖర్చు
ఐస్ ల్యాండ్ లో షూట్ చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీగా ఖర్చు చేయబోతున్నారు. నిర్మాత రామ్ తళ్ళూరి దర్శకుడు వి ఐ ఆనంద్ విజన్ కి తగినట్లుగా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిస్కో రాజాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐస్ ల్యాండ్ లో సెప్టెంబర్ 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్ ని దాదాపు 4 - 5 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ కీలక సన్నివేశం డిస్కో రాజా సినిమాలో కేవలం నాలుగు నిముషాల నిడివి మాత్రమే ఉండటం కొస మెరుపు.
డిస్కో రాజా కోసం ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 టీం
ఐస్ ల్యాండ్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలానే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం డిస్కో రాజా కోసం రంగంలోకి దిగబోతున్నారు. సినిమాకి హైలెట్ గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని డిస్కో రాజా టీం చెబుతుంది.
డిస్కో రాజా కి గ్రాఫిక్స్ హంగులు
మాస్ మహారాజ్ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్, అబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది.
నటీనటులు
రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్ : రామ్ తళ్లూరి
సమర్పణ : సాయి రిషిక
నిర్మాత : రజిని తళ్లూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థమన్. ఎస్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి
కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి
పిఆర్ఓ : ఏలూరు శ్రీను