అవును.. మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఓ ఫంక్షన్‌లో అమ్మాయి ముద్దిచ్చి, గట్టిగా హగ్ ఇచ్చి వెళ్లిపోయిందట. అయితే ఇదెక్కడ జరిగింది..? నిజంగానే జరిగిందా..? లేకుంటే పుకార్లా..? అని సందేహిస్తున్నారు.. నిజం నమ్మండి ఈ ఆసక్తికర విషయాన్ని వరుణ్ తేజే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
పైన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదెక్కడో ‘వాల్మీకి’ ఫంక్షన్‌లో జరిగిందనకుంటే మాత్రం.. మీరు పప్పులో కాలేసినట్లే మరి. ఇటీవల ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డారా..? అనే ప్రశ్న ఎదురువ్వగా.. అవును అని చెప్పి అసలు విషయం చెప్పుకొచ్చాడు. ‘ఫ్రెండ్స్‌తో కలిసి నేను ఓ ఫంక్షన్‌కి వెళ్లాను. అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుతుండగా.. సడన్‌గా ఓ అమ్మాయి దగ్గరికొచ్చి వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుంది. తిరిగి చూసే సరికి నా చెంపపైన ముద్దిచ్చి వెళ్లిపోయింది. అందరి ముందు ఇలా జరగడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’ ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు సమయం ఆసన్నమవ్వడంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.