Advertisementt

అన్నయ్య హీరోయిన్లందరూ తమ్ముడితో..!!

Mon 16th Sep 2019 01:05 PM
akkineni heros,akkineni naga chaitanya,akkineni akhil,heroines  అన్నయ్య హీరోయిన్లందరూ తమ్ముడితో..!!
News About Akkineni Heros!! అన్నయ్య హీరోయిన్లందరూ తమ్ముడితో..!!
Advertisement
Ads by CJ

అదేంటి టైటిల్ చూడగానే కాస్త తేడాగా అనిపిస్తోందనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఈ బ్రదర్స్‌ ఇద్దరూ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే.. కానీ అన్న మాత్రం దూసుకెళ్తుంటే.. తమ్ముడు మాత్రం అంతంత మాత్రమే. ఇంతకీ ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని కుటుంబం నుంచి మూడో తరంగా వచ్చిన నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించుకునేందుకు పోరాడుతూనే ఉన్నారు. ఇందులో అన్నయ్య మాత్రం ఇప్పటికే సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నాడు. అయితే తమ్ముడు అఖిల్‌కు మాత్రం పరిస్థితులు అనుకూలించట్లేదు. అయితే ఈ ఇద్దరు సినిమాలు తీయడంలో కామన్ పాయింట్ ఒక్కటి ఆసక్తికరంగా మారింది. 

అదేంటంటే.. అన్నయ్యతో సినిమాలో నటించిన హీరోయిన్లందరూ మళ్లీ తమ్ముడితో నటిస్తున్నారు. అదెలాగంటారా.. చైతూ సరసన ‘సవ్యసాచి’లో నటించిన నిధి అగర్వాల్.. అఖిల్ హీరోగా వచ్చిన ‘మజ్ను’ మూవీలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేకపోయింది. అయితే తాజాగా.. ఒకప్పుడు ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించిన పూజా హెగ్దే.. ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేయబోతోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. మరి ఈ భామ అయినా అఖిల్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుందో..? లేదో వేచి చూడాలి మరి.

News About Akkineni Heros!!:

News About Akkineni Heros!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ