Advertisementt

ఈ హీరోని.. విలన్ అవ్వమంటున్నారు..!

Mon 16th Sep 2019 01:17 AM
karthikeya,villain,nani gang leader,netizens,hero karthikeya,rx 100  ఈ హీరోని.. విలన్ అవ్వమంటున్నారు..!
Netizens Suggestions to Young Hero ఈ హీరోని.. విలన్ అవ్వమంటున్నారు..!
Advertisement
Ads by CJ

RX 100 సినిమాలో హీరోగా కండలు చూపించి మంచి హిట్ అందుకున్న హీరో కార్తికేయ.. హిప్పీ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. హిప్పీ సినిమా అలా అయితే... గుణ 369 కూడా అతనికి హిట్ ఇవ్వలేకపోయింది. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు, 6 ప్యాక్ బాడీ అన్ని కార్తికేయని హీరోని చేశాయి. తాజాగా విలన్ కూడా అయ్యాడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ దేవ్ పాత్రలో విలనిజాన్ని పండించాడు. ఈ శుక్రవారం విడుదలైన గ్యాంగ్ లీడర్ మిక్స్డ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ఇక నాని నటన ముందు కార్తికేయ కాస్త తేలిపోయినా... స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ పరంగా కార్తికేయ చూడడానికి విలన్ షేడ్స్‌లోనే కనబడతాడు. ఇక గ్యాంగ్ లీడర్‌లో దేవ్ గా తన పాత్రకి న్యాయం చేసాడు కానీ... మరింతగా ఆ పాత్రలో కార్తికేయ ఇన్వాల్వ్ అయితే బావుండేది. ఇక కార్తికేయకి నాని లాంటి హీరో దొరక్కుండా మరో హీరో దొరికినా సినిమాలో విలన్ పాత్రలో మరింతగా హైలెట్ అయ్యేవాడు. మరి నాని నటనే నేచురల్. మరి నేచురల్ నటన ముందు ఎలాంటి విలన్ అయినా తేలిపోవాల్సిందే కదా.. ఇక హీరోగా కన్నా కార్తికేయ విలన్ లుక్స్ కే సూట్ అయ్యాడంటున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో అయితే ఏకాంగా కార్తికేయపై హీరోగా ఎందుకు బాసు.. విలన్ అవతారమెత్తు అంటున్నారు. 

Netizens Suggestions to Young Hero:

Karthikeya villain in Nani Gang leader 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ