Advertisementt

కౌశల్ ఓవరాక్షన్ ఇంకా తగ్గలే..!

Mon 16th Sep 2019 01:15 AM
koushal,overaction,bigg boss telugu,nani,koushal army  కౌశల్ ఓవరాక్షన్ ఇంకా తగ్గలే..!
Again Koushal Overaction Revealed కౌశల్ ఓవరాక్షన్ ఇంకా తగ్గలే..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 2 లో హౌస్ మెట్స్ తో గొడవలు పడుతూ.. తన స్వార్ధం కోసం గేమ్ ఆడుతున్నాడని అన్నప్పటికీ... బయట సోషల్ మీడియాలో కౌశల్ కి ఓ ఆర్మీ ఏర్పడి.. కౌశల్ ని కౌశల్ ఆర్మీ విన్నర్ ని చేసింది. బిగ్ బాస్ 2 విషయంలో హోస్ట్ హీరో నాని కూడా సఫర్ అయినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా ఓ ఈవెంట్ కి హాజరైన బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ని ఓ ఛానల్ ప్రతినిధి మీకు బాగా నచ్చిన బిగ్ బాస్ హోస్ట్ ఎవరంటే నాని గారంటే ఇష్టం.. అలాగే ఎన్టీఆర్, నాగార్జున హోస్టింగ్స్ కూడా నచ్చుతాయని చెప్పడమే కాదు.. ఖాళీ సమయాల్లో బిగ్ బాస్ 3ని చూస్తుంటానని చెప్పాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఇంకా ఒరిజినల్ గా కనిపించడం లేదని.. ఇంకా యాక్టింగ్ మూడ్ లోనే ఉన్నారని చెప్పిన కౌశల్‌కి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని అడగగా.. ఆ ప్రశ్నని తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం ఛానల్ ప్రతినిధి మాత్రం పోనీ ఓ ముగ్గురి పేర్లు చెప్పండి అంటూ పట్టుబట్టగా.. దానికి కౌశల్ పేర్లు చెప్పను.. ఎందుకంటే కౌశల్ కి బిగ్ బాస్ 3లో ఇష్టమైన పేర్లు చెబితే... కౌశల్ ఆర్మీ ఫాలో అయ్యి వారినే విన్నర్‌ని చేసేస్తుంది అంటూ కాస్త ఓవరాక్షన్ చేసాడు. 

Again Koushal Overaction Revealed:

Koushal Comments on Bigg Boss 3 telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ