‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని ఓన్ చేసుకొని మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ - నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో....
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ‘‘సెప్టెంబర్ 13న విడుదలైన మా ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’ బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు మౌత్ పబ్లిసిటీతో ఇంకా థియేటర్స్ పెంచారు. మా బేనర్‌లో మరో మంచి క్వాలిటీ ఫిలిమ్. హ్యుజ్ బ్లాక్ బస్టర్. చాలా చోట్ల నాని గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అలాగే లాంగ్ రన్‌లో కూడా బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి. మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ - ‘‘మీరందరూ చూపిస్తున్న లవ్ అండ్ కేర్ కి థాంక్స్. అందరూ థియేటర్స్‌లో మాత్రమే సినిమా చూడండి’’ అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సి.ఇ.ఓ.చిరంజీవి(చెర్రీ) మాట్లాడుతూ - ‘‘ఎవరి నోట విన్నా వన్ వర్డ్ రివ్యూ ‘సినిమా చాలా బాగుంది’ అని. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షోకి అన్ని థియేటర్స్ ఫుల్ అవడమే కాకుండా ఈరోజు మార్నింగ్ షో కూడా చాలా ఫాస్ట్‌గా ఫిల్ అయ్యాయి. సినిమాను ఇంతలా ఓన్ చేసుకొని యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ మాట్లాడుతూ - ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన నా స్నేహితుడు విక్రమ్ కుమార్‌కి థాంక్స్. నాని లాంటి చాలా ఫేమస్ యాక్టర్, మైత్రి మూవీస్‌తో కలిసి పనిచేయడం చాలా ప్లజెంట్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ - ‘‘ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్‌కి చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరైనా సినిమా చూడకుంటే వెంటనే చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
నటుడు కార్తికేయ మాట్లాడుతూ - ‘‘సంతోషంగా ఉంది అని చెప్పడం చాలా చిన్న వర్డ్. నేను ఈ మూవీ చేద్దామని డెసిషన్ తీసుకున్నప్పుడు రకరకాల మాటలు వినపడ్డాయి. కానీ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో నేను తీసుకున్న డెసిషన్ మంచిదే అని అర్ధమయింది. ఈరోజు ఇంత పెద్ద రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా క్యారెక్టర్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఒక డ్రీమ్‌లా ఉంది. ఇందులో నేను చేసిన పెర్ఫామెన్స్ విక్రమ్ సర్ నాకు నేర్పించి చేపించారు. నాని గారు ఈ సినిమా ముందు వరకూ నాకు ఇన్స్పిరేషన్, ఈ సినిమాతో నాకు ఒక మెంటర్, ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మీరు చేస్తున్న ఎంకరేజ్ భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుంది’’ అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ‘‘నేను లోకల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు’ అని ఆ డైలాగ్ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ షోస్ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము ఇకనుండి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్ సినిమాను ఇంతలా ఓన్ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా రిలీజైనప్పడి నుండి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్‌కి ఒక ఎమొర్టికన్ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఒకటి నోటీస్ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్ ఫ్యాన్ క్లబ్‌ను క్రియేట్ చేశారు. ఫస్ట్‌డేనే ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి విషయం. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడింది అనే మెస్సేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మల్లికార్జున థియేటర్‌లో ఫ్యామిలీస్ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కజిన్ ఒక వీడియో క్లిప్ తీసి పంపింది. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.