Advertisementt

‘వాల్మీకి’కి ఆ హడావుడి ఏది?

Sat 14th Sep 2019 08:04 PM
promotions,valmiki movie,varun tej,harish shankar,valmiki telugu movie  ‘వాల్మీకి’కి ఆ హడావుడి ఏది?
No Promotions to Valmiki Movie ‘వాల్మీకి’కి ఆ హడావుడి ఏది?
Advertisement
Ads by CJ

ఏదైనా సినిమా ఒక వారంలో విడుదలవుతుంది అంటే.. ఆ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి. భారీ ప్రమోషన్స్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా.. అని ఎదురు చూడాలి. మరి మరో వారంలో రిలీజ్ పెట్టుకుని.. ఎటువంటి చడీ చప్పుడు చెయ్యడం లేదు వాల్మీకి టీం. అదే వారం విడుదల కాబోతున్న సూర్య బందోబస్త్.. ఎంతగా తెలుగులో డబ్ అవుతున్నప్పటికీ.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కానీ వాల్మీకి టీం మాత్రం ఎందుకో డల్ గా కనబడుతుంది. హరీష్ శంకర్,  వరుణ్ తేజ్ లో సినిమా సెప్టెంబర్ 20 న విడుదల అంటూ రోజుకో పోస్టర్, స్టిల్ మీడియాలో విడుదల చేస్తున్నారు కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ పక్కాగా స్టార్ట్ కాలేదు.

ఇప్పటికే వరుణ్ తేజ్, హీరోయిన్ పూజ, మరో హీరో అధర్వ, హరీష్ శంకర్ సోలో ప్రమోషన్స్ మొదలవ్వాలి. కానీ సినిమా మీద ఎంతగా క్రేజున్నా సినిమాని సరైన రీతిలో ప్రమోట్ చెయ్యకపోతే... సినిమాకి మంచి టాక్ పడినా ఉపయోగం ఉండదు. మరి ప్రస్తుతం కోర్టు గొడవలతో ఇబ్బందుల్లో పడ్డ వాల్మీకి టీం... ఆ గొడవ సద్దుమణిగాక.. ప్రమోషన్స్ చూసుకుందామనుకుంటున్నారో.. ఏమో.. చూడాలి.

No Promotions to Valmiki Movie:

Promotions not started to Valmiki Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ