Advertisementt

‘నాని గ్యాంగ్ లీడర్’ ఈ టాక్‌తో నిలబడతాడా?

Sat 14th Sep 2019 08:01 PM
nani gang leader,nani,gang leader,vikram kumar,movie talk,marshal,pehlwaan  ‘నాని గ్యాంగ్ లీడర్’ ఈ టాక్‌తో నిలబడతాడా?
Nani Gang Leader Movie Released ‘నాని గ్యాంగ్ లీడర్’ ఈ టాక్‌తో నిలబడతాడా?
Advertisement
Ads by CJ

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ నిన్న శుక్రవారం విడుదలయింది. ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు మాత్రం గ్యాంగ్ లీడర్ పర్వాలేదంటే... రివ్యూ రైటర్స్ మాత్రం మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. నాని తన నటనతో సినిమాని ఎంతగా నిలబెట్టాలని చూసినా.. మధ్య మధ్యలో వచ్చిన స్లో నేరేషన్, సాంగ్స్ సరిగ్గా లేకపోవడం, సెకండ్ హాఫ్ మరీ డల్‌గా ఉండడం, ఎప్పుడు లాజిక్‌గా సినిమాలు తీసే విక్రమ్ కుమార్.. ఈసారి లాజిక్ మిస్ కావడం లాంటి వాటితో సినిమాకి మిక్స్డ్ టాక్ పడిపోయింది.

మరి గత వారం సినిమాలేవీ బాక్సాఫీసుని ప్రభావితం చేయలేకపోవడం, ఈవారం గ్యాంగ్ లీడర్ కి పహిల్వాన్, మార్షల్ సినిమాలు గట్టి పోటీ ఇవ్వకపోవడం మాత్రం నాని గ్యాంగ్ లీడర్ కి కలిసొస్తుందని చెప్పాలి. ఏదైనా కలిసిరావడం అటుంచి... ఈ సినిమాని జెర్సీ స్థాయిలో ఊహించుకుని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదనేలా ఉంది గ్యాంగ్ లీడర్. కథ కొత్తగా ఉన్నప్పటికీ.. విక్రమ్ కుమార్ సినిమాని నడిపించిన తీరు గొప్పగా లేదు. అలాగే కొన్ని ట్విస్ట్ లు బావున్నపటికీ.. స్లో నేరేషన్ బాగా దెబ్బేయ్యడంతో.. సినిమాకి పర్ఫెక్ట్ పాజిటివ్ టాక్ పడలేదు. మరి గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏమిటనేది.. ఒక వారం రోజుల్లో ప్రేక్షకులే తేల్చేస్తారు.

Nani Gang Leader Movie Released:

Nani Gang Leader Movie Talk out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ