Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేశ్ పారితోషికం..!

Sat 14th Sep 2019 07:09 PM
mahesh babu,superstar mahesh,remuneration sarileru neekevvaru  ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేశ్ పారితోషికం..!
Mahesh remuneration for sarileru neekevvaru.. ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేశ్ పారితోషికం..!
Advertisement
Ads by CJ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్, రష్మిక మందన్నా నటీనటులుగా వస్తున్న చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాను హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా జరుపుకుంటోంది. అయితే ఈ క్రమంలో సినిమా గురించి పలు ఆసక్తికర, హాట్ హాట్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ సినిమా కోసం.. ‘మహేశ్‌కు ఎవ్వరూ సరిలేరు’ పారితోషికం అనేంతలా పుచ్చుకున్నారని టాక్ నడుస్తోంది.

వాస్తవానికి మహేశ్ కొన్నేళ్ల కిందటే పారితోషికం తీసుకోవడం మానేశాడన్న సంగతి తెలిసిందే. పారితోషికం కాకుండా సినిమాకు సంబంధించి హక్కులు తీసుకోవడం మొదలెట్టారు. అయితే.. ఈ విషయంలో మహేష్-నిర్మాతలకు కూడా బడ్జెట్ విషయంలో సానుకూలత ఏర్పడుతూ వస్తుండటంతో అంతా సాఫీగానే ఉంది. ‘మహర్షి’ సినిమాకు కూడా మహేశ్..  నాన్ థియేట్రికల్ హక్కులు తీసుకున్న విషయం విదితమే. తాజాగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో కూడా మహేష్ అదే ఫాలో అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

‘మహర్షి’ లాగా ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా నాన్ థియేట్రికల్ హక్కులు మహేష్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంటే కాస్త ఇటు అటు అయినా సుమారు రూ. 52 కోట్లకు పైగానే ఆయనకు ముట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులు, సినీ ప్రియుల ముందుకు రానుంది. అయితే తాజాగా వస్తున్న ఈ రూమర్స్‌పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Mahesh remuneration for sarileru neekevvaru.. :

Mahesh remuneration for sarileru neekevvaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ