రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం RRR. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నుండి ఏ న్యూస్ వచ్చిన అది ఎక్కువగా తారక్ మీదే వస్తుంది. సినిమాలో తారక్ తో ఇటువంటి ఫైట్ చేయిస్తున్నారు అని, సినిమాలో తారక్ పై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు అని ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా కోసం తారక్ చాలా కసరత్తులు చేస్తున్నాడు అని ఫుల్ టైం తన పాత్ర కోసం కష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
కానీ చరణ్ పై మాత్రం ఎటువంటి వార్తలు రావడంలేదు. చరణ్ ఈ చిత్రం షూటింగ్ కి ఏదో హాలిడేకి వెళ్లి వచ్చినట్టుగా షూటింగ్‌కి వెళ్లి వస్తున్నాడు. ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సైరా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దాంతో ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ పాత్రకి అసలు సరయిన వెయిట్ వుంటుందా లేదా అనే కలవరం మెగా అభిమానుల్లో మొదలయింది.
ఎంతసేపు తారక్ మీదే ఫోకస్ పెట్టిన రాజమౌళి రామ్ చరణ్ పై ఎందుకు పెట్టడంలేదని అభిమానుల్లో ఆందోళన మొదలయింది. ఇద్దరు సమవుజ్జీలయిన హీరోలు ఒకే సినిమాలో వున్నపుడు సహజంగానే అభిమానుల్లో కలవరం వుంటుంది. మరి ఇవన్నీ ఆలోచించే రాజమౌళి సినిమా చేస్తున్నాడా? మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది. బహుశా తారక్ షూటింగ్ తరువాత అంత రామ్ చరణ్ మీదే షూటింగ్ ఉండనుందా? ఏమో చూడాలి. మనం అప్పుడే ఓ నిర్ణయంకి రాలేం.