మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్ అక్టోబర్ 2 న రిలీజ్ అవుతుంది. ఎన్నో చర్చలు తరువాత నిన్న ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ డీల్ లాక్ అయింది. అది కూడా 15 కోట్లుకి కావడం విశేషం. మొన్నటివరకు ఈ సినిమా 18 కోట్లుకి వెళ్లిందని వార్తలు వచ్చాయి కానీ నిన్నే ఈ సినిమా 15 కోట్లుకి వెళ్లిందని తెలుస్తుంది.
ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని తీసుకున్న ఫారస్ సంస్థనే సైరా విదేశీ పంపిణీ హక్కులు తీసుకుంది. ఇది ఒక రకంగా మంచి డీలే. మహర్షి లాంటి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన అనుకున్న రేంజ్ కి మాత్రం రావడం కష్టం అయిపోయింది. సాహో అయితే సగానికి సగం నష్ట పోయింది. ఇటువంటి టైంలో సైరాని ఎక్కువకు అమ్మితే నష్టాలు తప్పవు అని 15 కోట్లుకి అమ్మారు. చిరు క్రేజ్, సైరా బజ్ అన్నీ కలిసి ఈ చిత్రంపై 10 కోట్లకు పైగా వస్తుందని ఆశిస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చిన పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
ఇక ఈ మూవీ అమెరికాలో ఫారస్ సంస్థనే పంపిణీ చేస్తుందా? లేక అక్కడ తెలుగు సినిమాల పంపిణీలో అనుభవం వున్న సంస్థ ద్వారా చేస్తుందా? అన్నది తెలియాల్సిఉంది. చిరు సరసన ఇందులో నయనతార నటిస్తుంది. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంకు దాదాపు 250 కోట్లు ఖర్చు అయిందని తెలుస్తుంది.