Advertisementt

‘దేవినేని’ నుంచి కోటి లుక్ విడుదల

Fri 13th Sep 2019 06:42 PM
devineni movie,koti,look,released  ‘దేవినేని’ నుంచి కోటి లుక్ విడుదల
Music Director Koti in Devineni Movie ‘దేవినేని’ నుంచి కోటి లుక్ విడుదల
Advertisement
Ads by CJ

‘దేవినేని’ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  సంగీత దర్శకుడు కోటి ఫస్ట్ లుక్ విడుదల ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబనేపథ్యంలో సెంటిమెంట్ ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో  తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో  ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, దృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘1977 దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ లో జై ఆంధ్ర యా స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ చిత్రంలో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంద్రప్రదేశ్ లో పలుచోట్ల షూటింగ్ జరుపుకుంటుంది. భారీ స్థాయిలో ఉండే పతాక సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్’’ అన్నారు.

కోటి మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ లో ఇది సెకండ్ పేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మీ ముందుకు  రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను పెద్ద ఐపిఎస్  ఆఫీసర్ గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983 తో రాజ్ కోటి గా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్ గారు విజయవాడకి ఫస్ట్ పవర్ఫుల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగు గారు వండర్ ఫుల్ డైరెక్టర్. ఈ క్యారెక్టర్ కి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

నటీనటులు : నందమూరి తారక రత్న, కోటి, తుమ్మల ప్రసన్న కుమార్, సురేష్ కొండేటి, బెనర్జీ, నాగినీడు, పృధ్వి, అజయ్, M.N.R చౌదరి, అన్నపూర్ణమ్మ, శివారెడ్డి, తేజ రాథోడ్, బాక్సాఫీస్ రమేష్, రామ్మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 

సాంకేతిక నిపుణులు : 

దర్శకత్వం : నర్రా శివనాగేశ్వరరావు

నిర్మాత : రామ్ రాథోడ్

బ్యానర్ :  ఆర్.టి.ఆర్ ఫిలింస్

Music Director Koti in Devineni Movie:

Devineni Movie Koti Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ