నల్లమలను కాపాడుకుందాం -విజయ దేవరకొండ
20,000 ఎకరాల నల్లమల అడవిని నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితికి వచ్చాము. గాలి, నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీని వినియోగంలోకి తెద్దాం...ప్రతి పై కప్పుపై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీతో ఏమి చేయాలి...? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం. నల్లమలను కాపాడుకుందాం... మనకోసం, మన భవిష్యత్ కోసం.