సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే రెండు లుక్స్, నేమ్‌తో రివీల్ మహేశ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే. ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ హాట్ వార్త అటు సోషల్ మీడియాలో ఇటు వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మహేశ్‌తో మిల్క్‌బ్యూటీ తమన్నా కూడా కాలు కదపనుందని.. ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.. నటించేది కాసేపు మాత్రమే అయినా గట్టిగానే పారితోషిక పుచ్చుకుంటోందని వార్తలు వచ్చాయి. అయితే అదంతా తూచ్ అట.. తమన్నా స్థానంలో తాజాగా పూజా హెగ్దేను తీసుకున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల మహేశ్ సరసన ‘మహర్షి’లో నటనకు ఫిదా అయిన.. సరిలేరు నీకెవ్వరు దర్శకనిర్మాతలు.. పూజాతోనే ఇంట్రడక్షన్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే దాదాపు సరిలేరు నీకెవ్వరు షూటింగ్ అయిపోవచ్చింది.