Advertisementt

హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

Thu 12th Sep 2019 02:47 PM
vijayashanthi,sensational comments,tollywood heroines,sarileru neekevvaru  హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!
Vijayashanthi Sensational Comments On Tollywood Heroines హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా రాణిస్తున్న ఈ తరం హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమే చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను దుమారమే రేపుతున్నాయి. అసలేం జరిగింది..? రాములమ్మ ఏమన్నారు..? ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ల రియాక్షన్ ఉంటుందా..? లేదా అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో నేటి తరం హీరోయిన్ల గురించి మాట్లాడాలని మీడియా మిత్రల నుంచి ప్రశ్న ఎదురవ్వగా విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ తరం హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం..? అనే ప్రశ్నకు ఈమె బదులిస్తూ.. ఈ రోజుల్లో హీరోయిన్లు ఏడాదిలో కేవలం రెండు, మూడు సినిమాలకే పరిమతం అవుతున్నారని.. అప్పట్లో తాము హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఏడాదికి 15 నుంచి 18 సినిమాల్లో నటించేవాళ్లమని.. వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆమె.. ఇప్పుడున్న హీరోయిన్లు పెద్దగా కష్టపడడం లేదని.. కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేసి.. అలసిపోకుండా జాగ్రత్తపడుతున్నారని చెప్పుకొచ్చారుజ

అయితే ఈ వ్యాఖ్యలు విజయశాంతి ఎందుకన్నారో..? ఎందుకిలా సడన్‌గా అన్నారో..? అనేది రాములక్క తెలియాల్సి ఉంది. అవకాశం వస్తే ఏడాదికి ఒకట్రెండు ఏంటి..? ఏడెనిమిది సినిమాల్లో నటించడం పెద్ద విషయమేమీ కాదు.. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరన్న విషయం విదితమే. మరి ఈ వ్యాఖ్యలపై ఈ తరం నటీమణులు స్పందిస్తారో లేకుంటే సైలెంట్‌గా ఉండిపోతారో తెలియాల్సి ఉంది.

Vijayashanthi Sensational Comments On Tollywood Heroines:

Vijayashanthi Sensational Comments On Tollywood Heroines  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ