Advertisementt

అనీల్ రావిపూడితోనే మహేశ్.. రెండో సినిమా!

Tue 10th Sep 2019 02:24 PM
mahesh babu,sarileru neekevvaru,director anil raavipudi,tollywood  అనీల్ రావిపూడితోనే మహేశ్.. రెండో సినిమా!
Mahesh Babu Next Movie with Sarileru neekevvaru Director అనీల్ రావిపూడితోనే మహేశ్.. రెండో సినిమా!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్ దాదాపు 70 శాతం అయిపోయింది. మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసుకోని నవంబర్ కల్లా అన్నీ క్లోజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో మహేశ్-అనీల్ గురించి పుకార్లు మొదలయ్యాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ‘గీతాగోవిందం’ దర్శకుడు పరుశురామ్‌తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే అబ్బే అదంతా కాదట. మళ్లీ అనీల్‌తోనే సినిమా చేయాలని మహేశ్ భావిస్తున్నాడట. ఇందుకు కారణం.. అనీల్ టేకింగ్, ఆలోచన.. గట్స్ అట. అందుకే అనీల్‌ డైరెక్షన్ ఫిదా అయిన సూపర్ స్టార్‌ స్వయంగా అనీల్‌ను ఈయనే అడిగారట.

అంటే సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ కాకమునుపే మరో సినిమాకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న మాట. అనీల్-మహేశ్ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఎలా ఉంటుంది..? మహేశ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎలా రియాక్ట్ అవుతారు..? అనేది తెలిస్తేనే రెండో సినిమా ఉంటుందా..? ఉండదా అని అభిమానులే తేలుస్తారు.

Mahesh Babu Next Movie with Sarileru neekevvaru Director:

Mahesh Babu Next Movie with Sarileru neekevvaru Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ