రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు గారి బయోపిక్
జైనీ క్రియేషన్ పతాకంలో డా. ప్రభాకర్ జైనీ దరకత్వలో కాళోజి నారాయణరావు గారి బయోపిక్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. 9.9.2019 కాళోజి నారాయణ రావు గారి 105వ జయంతి. ‘భారత రత్న’ తర్వాత 1992లో భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర సత్కారం ‘పద్మ విభూషణ్’ (Second Highest Civilian Award)తో సత్కరించబడిన కాళోజీ నారాయణ రావు గారి జీవిత విశేషాలను, ఆయన రచనలను, ఆయన స్వాతంత్య్ర పోరాట విశేషాలను ప్రస్తుత తరపు యువతీయువకులకు పరిచయం చేసి, మన సాంస్కృతిక పునరుజ్జీవననానికి హారతి పట్టిన వారి జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో, ‘జైనీ క్రియేషన్స్’ పతాకంపై కాళోజీ నారాయణ రావుగారి బయోపిక్ ‘కాళన్న’ పేరుతో ప్రారంభిస్తున్నట్టుగా, ఇండియన్ అచీవర్స్ అవార్డు, 2019 గ్రహీత, ప్రముఖ నవలా రచయిత, ‘నంది అవార్డు’ గ్రహీత, ‘అమ్మా! నీకు వందనం!’; ‘ప్రణయవీధుల్లో.. పోరాడే ప్రిన్స్’; ‘క్యాంపస్-అంపశయ్య’ వంటి మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ ప్రభాకర్ జైని, ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ బయోపిక్ కు సంబంధించిన ప్రిలిమినరి ప్రొడక్షన్ పని ప్రారంభించామని, కాళోజికి సంబంధించిన అనేక దస్తావేజులు, ఫోటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఒక స్టోరీ లైన్ ను అనుకున్నామని, నిర్మాత విజయలక్ష్మి జైనీ చెప్పారు.
కాళోజీకి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వీ.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మితృలతో సంప్రదించి స్క్రీన్ ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకులు డా. ప్రభాకర్ జైనీ చెప్పారు. ఈ ‘కాళన్న’ చిత్రానికి కెమెరా ‘సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్’ లో కెమెరా శిక్షణ పొంది, ‘అంపశయ్య’ సినిమా చిత్రీకరణలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించిన రవి కుమార్ నీర్ల; సంగీతం: ఘంటసాల విశ్వనాథ్; ఒక పాట మహమ్మద్ సిరాజుద్దీన్;
రచన, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డా ప్రభాకర్ జైనీ నిర్వహిస్తున్న ఈ సినిమాకు నిర్మాత విజయలక్ష్మీ జైనీ.