Advertisementt

బిగ్ బాస్ 50వ ఎపిసోడ్.. ఏడుపు మయం!

Tue 10th Sep 2019 12:27 PM
bigg boss telugu,ali reza,eliminated,50th episode,bigg boss  బిగ్ బాస్ 50వ ఎపిసోడ్.. ఏడుపు మయం!
Bigg Boss 50th Episode Update బిగ్ బాస్ 50వ ఎపిసోడ్.. ఏడుపు మయం!
Advertisement
Ads by CJ

తెలుగు బిగ్ బాస్ ఇప్పటికి ఏడువారాలను పూర్తి చేసుకుంది అంటే... 50 రోజులు పూర్తి చేసుకుంది. నాగార్జున చెప్పినట్టుగా ఈ 50 రోజుల్లో ప్రేమ, టాస్క్, ఎమోషన్, గొడవలు అన్ని అనేకం జరిగాయి. కానీ ఈ 50 రోజుల ఎపిసోడ్ లో మాత్రం కేవలం కంటెస్టెంట్స్ ఏడుపు మాత్రమే కనబడింది. కారణం ప్రేక్షకులకే కాదు.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చాడు కాబట్టి. అదీ చాలా స్ట్రాంగ్ అండ్ ఎనర్జిటిక్ కంటెస్టెంట్ అలీ రెజా ఎలిమినేట్ అవడం. అందరూ రవి కానీ మహేష్ కానీ ఎలిమినేట్ అవుతారని భావిస్తే.. అనూహ్యంగా బిగ్ బాస్ అలీ ని ఇంటికి పంపాడు.

రాహుల్ ని శ్రీముఖి ఎంతగా టార్గెట్ చేసిన రాహుల్ ఓటింగ్ లో ముందుండి షాకిస్తే... అలీ ఎలిమినేట్ అయ్యి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. కారణం అలీలోని కోపమే అతడిని ఇంటికి పంపేసింది. అలీ ఎలిమినేట్ అని నాగ్ చెప్పగానే ముందుగా షాకయిన జ్యోతి, శ్రీముఖిలు ఏడుపు మొదలెట్టడమే కాదు... ఎక్కెక్కి ఏడ్చారు. జ్యోతికి అలీ అన్నలా కలిసిపోగా.. శ్రీముఖికి అలీ మంచి దోస్త్ కేవలం వారిద్దరే కాదు... వితిక, వరుణ్, రాహుల్, మహేష్, బాబా భాస్కర్, రవి ఆఖరికి నిన్నగాక మొన్నొచ్చిన శిల్ప కూడా కంటతడి పెట్టేసారు. అయితే ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి... కానీ షాకింగ్ గా అలీ ఎలిమినేట్ అయ్యేసరికి అందరిలో ఒకటే బాధ. ఒకానొక సమయంలో వారి ఏడుపుకి ప్రేక్షకులు చిరాకు పడేంతగా ఏడ్చారు హౌస్ మేట్స్. ఇక అలీ మొదటిసారి నామినేట్ అయ్యి... ఆ నామినేషన్‌తోనే ఎలిమినేట్ అవడం గమనార్హం.

Bigg Boss 50th Episode Update:

Bigg Boss Telugu: Ali Reza Eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ