మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. మెగాస్టార్ చిరు, డైరెక్టర్ సురేందర్ ఇంటర్వ్యూలు మొదలెట్టేశారు. ఈ సందర్భంగా సినిమాలో నటించిన నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఈ సినిమాలో ముగ్గురు స్టార్ లేడీ సూపర్ స్టార్ నయనతార, మిల్క్ బ్యూటీ తమన్నా, యోగా బ్యూటీ అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనుష్క విషయానికొస్తే.. ఈ సినిమాలో ఈ భామ ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో అనుష్క నటించిందట. సినిమా కథ అనుష్క చెప్పడంతోనే ప్రారంభమై.. ఆమెతోనే ముగిస్తుందట. అంటే మొదట ఐదు నిమిషాలు.. చివర ఐదు మొత్తం పదే పదే నిమిషాలు మాత్రం అనుష్క పాత్ర వ్యవధి అన్న మాట. సో.. ఈమె పాత్ర ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? సినిమాకు ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
కాగా.. బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, నిహారిక, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సినిమాన అక్టోబర్- 2న విడుదల చేసేలా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.