Advertisementt

RRR నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త!

Mon 09th Sep 2019 01:55 PM
good news,ntr,ntr fans,rrr  RRR నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త!
Good news For Ntr Fans From RRR RRR నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త!
Advertisement
Ads by CJ

 

ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే ఈ భారీ చిత్రం షూటింగ్ విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే.. జక్కన్న, జూనియర్, చెర్రీ అభిమానులకు శుభవార్తే మరి. ఎందుకంటే ఇందులో స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు కాబట్టి.

తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఫలానా తేది ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. కొమురం భీం జయంతి అక్టోబర్ 22న అనే విషయం విదిమే. ఈ సినిమాలో జూనియర్ ఉద్యమకారుడు కొమురం భీం పాత్రలో నటిస్తుండటంతో.. ఆయన జయంతి రోజున ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే ఇంకో నెలన్నరపాటు ఫస్ట్ లుక్ కోసం నందమూరి, జూనియర్ వీరాభిమానులు వేచిచూడాల్సిందే అన్న మాట.

ఎప్పుడైతే ఏముంది..? జూనియర్ లుక్ రావాలంతే..? అదే మాకు శుభవార్త అని సోషల్ మీడియాలో జూనియర్ అభిమానులు తమ ఆనందం పంచుకుంటున్నారు. మరి ఈ రూమర్‌లో ఏ మాత్రం నిజముందో..? అనేది తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Good news For Ntr Fans From RRR:

Good news For Ntr Fans From RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ