Advertisementt

మెగా ఫ్యాన్స్‌కు ‘సైరా’ నుంచి షాకింగ్ న్యూస్!

Sun 08th Sep 2019 08:38 PM
shocking news,syraa,mega fans,syraa release  మెగా ఫ్యాన్స్‌కు ‘సైరా’ నుంచి షాకింగ్ న్యూస్!
shocking news from syraa movie unit మెగా ఫ్యాన్స్‌కు ‘సైరా’ నుంచి షాకింగ్ న్యూస్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగు‌తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. చిరు కూడా ఇంటర్వ్యూలు మొదలెట్టేశారు. ఇంతవరకూ అన్నీ ఓకే కానీ..సరిగ్గా ఇదే సమయంలో ‘సైరా’ చిత్రబృందం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

‘సైరా’ రిలీజ్ అక్టోబర్-02న కాదు.. అక్టోబర్-08న అన్నదే ఆ షాకింగ్ న్యూస్ సారాంశం. ఇందుకు కారణం ఇంకా గ్రాఫిక్స్ పనులు కొలిక్కి రాకపోవడమేనని టాక్ నడుస్తోంది. అందుకే ఆరు రోజుల పాటు ఆలస్యంగా రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే.. ఈ షాకింగ్ న్యూస్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే దర్శకనిర్మాతలు స్పందించాల్సిందే మరి.

shocking news from syraa movie unit:

shocking news from syraa movie unit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ