Advertisementt

‘సైరా’ కోసం నయన్ అంత తీసుకుందా!?

Sun 08th Sep 2019 02:47 PM
lady superstar nayanthara,shocking remuneration,syraa,nayan  ‘సైరా’ కోసం నయన్ అంత తీసుకుందా!?
Shocking Details About Nayan’s Remuneration! ‘సైరా’ కోసం నయన్ అంత తీసుకుందా!?
Advertisement
Ads by CJ

తమిళనాట లేడీ సూపర్ స్టార్‌గా హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ అందుకుంటుంది నయనతార. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమేనా రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. అప్పుడప్పుడు టాలీవుడ్ హీరోలతోనూ నటిస్తుంది. అది కూడా బరి పారితోషకానికి. తాజాగా నయనతార ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా కోసం భారీ పారితోషకం అందుకుందనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు... బయట కూడా తెగ వైరల్ అయ్యింది. ‘సైరా’ నరసింహారెడ్డిలో చిరుకి భార్యగా మెయిన్ లీడ్‌లో నటించిన నయనతార ఈ సినిమాలో అదిరిపోయే లుక్‌లో కనబడుతుంది.

ఇక ‘సైరా’ కోసం నయనతార అక్షరాలా 6.3 కోట్లను అందుకుందనే న్యూస్ హాట్ హాట్‌గా ఫిలింసర్కిల్స్‌లో చర్చకు దారితీసింది. మరి అంత అందుకున్న నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. ‘సైరా’ టీజర్ భారీ ఎత్తున ముంబైలో నిర్వహిస్తే హ్యాండ్ ఇచ్చింది. ఇక ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చరణ్.. నయనతారని బుజ్జగిస్తున్నాడనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ప్రమోషన్స్‌కి రాకుండానే ఒక సినిమా కోసం నయనతార అంత పెద్ద మొత్తంలో భారీ పారితోషకం అందుకోవడం అనేది షాకింగ్ విషయంగానే చెప్పాలి. మరి ఆ రేంజ్లో క్రేజ్ ఉంది కాబట్టే అందరి కన్ను నయనతార మీదే ఉంది.

Shocking Details About Nayan’s Remuneration!:

Shocking Details About Nayan’s Remuneration!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ