Advertisementt

ఈ శుక్రవారం మరీ ఇంత డల్‌గా ఉందేంటి!!

Sun 08th Sep 2019 02:42 PM
friday,dull,saaho,tollywood,valmiki  ఈ శుక్రవారం మరీ ఇంత డల్‌గా ఉందేంటి!!
Why These Friday Too Dull !! ఈ శుక్రవారం మరీ ఇంత డల్‌గా ఉందేంటి!!
Advertisement
Ads by CJ

‘సాహో’ ప్రభావంతో ఈ శుక్రవారం విడుదల కావాల్సిన ‘వాల్మీకి’ ఏకంగా ఈనెల 20 కి వెళ్ళిపోతే.. ‘సాహో’ డేట్‌కి రావాల్సిన ‘గ్యాంగ్ లీడర్’ ఈ నెల 13 కి వెళ్ళింది. ఇక సాహో కి రెండో వారంలో ఎదురు నిలిచే దమ్ములేక పక్కకి జరిగిన సినిమాలు కాకుండా.... సాహో అంటే భయం లేదని చిన్న సినిమాలు నాలుగు బాక్సాఫీసు వద్దకు దిగాయి. అందులో ఆది సాయి కుమార్ జోడి సినిమా మీద అందరిలో కాస్త ఇంట్రెస్ట్ ఉండగా.. ‘ఉండిపోరాదే’, ‘నీ కోసం’, ‘దర్పణం’, ‘2 అవర్స్ లవ్’ అనే సినిమాలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా బరిలోకి దిగాయి.

అయితే సాహోని లెక్క చెయ్యని ఈ సినిమాలు కూడా బాక్సాఫీసుని ఏ మాత్రం ప్రభావితం చెయ్యలేకపోయాయి. అది సాయి కుమార్ ‘జోడి’తో ఎప్పటిలాగే ఓ ప్లాప్ కొట్టాడు. సినిమాలో కథ అవుట్ డేటెడ్ మాత్రమే కాదు.. అన్నీ మైనస్ పాయింట్స్ ఉండడంతో సినిమా చెట్టెక్కేసింది. ఇక ఉండిపోరాదే, నీ కోసం, దర్పణం, 2 అవర్స్ లవ్ సినిమాలు అసలెప్పుడు తెరకెక్కాయో కూడా ప్రేక్షకుడికి తెలియవు. సో సో ప్రమోషన్స్ తో విడుదలైన ఈ నాలుగు సినిమాలు ఈ వారం ప్రేక్షకులకు ఫుల్ గా బోర్ కొట్టించాయి. ఇక సాహో అయినా ఈ వారం కాస్త  పుంజుకుంటుంది ఆనుకుంటే అదీ లేదు. సాహో శుక్రవారం కలెక్షన్స్ కూడా పూర్‌గా ఉన్నాయి. ఇక వచ్చే వారం నాని గ్యాంగ్ లీడర్ కోసం ఇప్పుడు ప్రేక్షకులు కాస్త ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

Why These Friday Too Dull !!:

Why These Friday Too Dull !!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ