Advertisementt

‘డిస్కోరాజా’తో శ్రుతిహాసన్ రొమాన్స్!!

Sat 07th Sep 2019 09:31 PM
ravi teja,romance,shruti haasan. disco raja  ‘డిస్కోరాజా’తో శ్రుతిహాసన్ రొమాన్స్!!
Ravi Teja Again Romance with Shruti Haasan in disco raja ‘డిస్కోరాజా’తో శ్రుతిహాసన్ రొమాన్స్!!
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇప్పటికే మొదలైన షూటింగ్ విజయవంతంగా సాగుతోంది. ‌ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరే కాకుండా మూడో హీరోయిన్‌‌ ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ మూడో భామ ఎవరో కాదు.. ‘రేసుగుర్రం’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలతో టాలీవుడ్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన శ్రుతి హసన్. డిస్కోరాజాలో ఈ భామ ఓ కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. అంతేకాదు.. ఈమె పాత్రే సినిమాకు హైలైట్ కానుందట. ప్రస్తుతం శృతితో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించి చాలా రోజులే అయ్యింది.. అందుకే టాలీవుడ్‌లో నటించాలని శృతి కూడా ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తోంది. అంతేకాదు.. గతంలో ‘బలుపు’ సినిమాలో రవితేజ సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. డిస్కోరాజాలో నటించడమే నిజమైతే రవితేజతో శృతి రెండోసారి రొమాన్స్ చేస్తుందన్న మాట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Ravi Teja Again Romance with Shruti Haasan in disco raja:

Ravi Teja Again Romance with Shruti Haasan in disco raja  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ