రోజురోజుకి బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుంది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ పెరిగేకొద్దీ కెప్టెన్సీ టాస్కులు, లక్సరీ బడ్జెట్ టాస్కులు చాలా కఠినంగా ఇస్తున్నారు బిగ్ బాస్. దింతో బిగ్ బాస్ హౌస్ లో ఉండే పార్టిసిపంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయ్. ఇవి పర్సనల్ గా తీసుకుని వెళ్తున్నాయి.
అందరి సంగతి ఏమో కానీ జంటగా గా ఎంటర్ అయినా వరుణ్ అండ్ వితిక లు మధ్య గొడవలు రోజురోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. వితిక ఏమో వరుణ్ ని తనతో సన్నిహితం గా ఉండాలని కోరుకుంటుండగా, వరుణ్ మాత్రం బిగ్ బాస్ హౌస్ కావున ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమెను వరుణ్ సూటిపోటి మాటలు అనడం వితిక నచ్చడంలేదు. అలా వీరి మధ్య గ్యాప్ వస్తుంది.
ఈ అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు షో వరకే అయితే పర్లేదు. ఇవి పర్సనల్ గా తీసుకుని బయటకు వెళ్ళాక కూడా అలానే ఉంటె ఆ ప్రభావం వారి నిజ జీవితం పైన కూడా పడే ప్రమాదం ఉంది. మరి ఈ గొడవలు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.