Advertisementt

‘ధమ్కీ’ టీమ్‌కు వినాయక్ సపోర్ట్

Sat 07th Sep 2019 01:30 PM
vv vinayak,dhamki movie teaser,sunkara brothers,dhamki movie  ‘ధమ్కీ’ టీమ్‌కు వినాయక్ సపోర్ట్
Dhamki Movie Teaser Released ‘ధమ్కీ’ టీమ్‌కు వినాయక్ సపోర్ట్
Advertisement
Ads by CJ

ధమ్కీ మూవీ టీజర్ బాగుంది. తప్పకుండా సుంకర బ్రదర్స్‌ బేనర్‌కి మంచి ఫౌండేషన్‌ అవుతుంది: వివి వినాయక్  

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కరరావు సమర్పణలో సుంకరబ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. రజిత్‌, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వం వహించారు. రచయిత శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ సినిమాకి ఎస్‌.బి ఆనంద్‌ సంగీతం, దీపక్‌ భగవంత్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌, బ్యానర్‌లోగోను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్‌ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి వి వినాయక్‌ మాట్లాడుతూ.. ‘‘సుంకర బ్రదర్స్‌ మా కుటుంబానికి చాలా కావాల్సిన వారు. వాళ్ళ తమ్ముడికి మంచి లైఫ్‌ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో సుంకర బ్రదర్స్‌ ఈ బేనర్‌ని స్థాపించడం జరిగింది. ఫ్యామిలీ వాల్యూస్‌ తెలిసిన వ్యక్తిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే వాళ్ళ తమ్ముడు మంచి స్థాయికి రావాలని, ఈ బ్యానర్‌ సుంకర బ్రదర్స్‌ ఎక్కడున్నా వారందరికి మంచి పేరు తీసుకొచ్చే బ్యానర్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులలోనూ మంచి అన్నదమ్ములు అంటే ఉదాహరణగా మీ ముగ్గురు ఉండాలి. అలాగే ధమ్కీ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం సుంకర బ్రదర్స్‌ బేనర్‌కి మంచి ఫౌండేషన్‌ అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు. 

ఫైట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడుతూ.. ‘‘మా సుంకర బ్రదర్స్‌ ని ఆశీర్వదించడానికి వచ్చిన వివి వినాయక్‌ గారికి ధన్యవాదాలు. ఆయన చేతుల మీదుగా మా బ్యానర్‌ లాంచ్‌ అవ్వాలనేది మా ముగ్గురి అన్నదమ్ముల కోరిక. మా అమ్మానాన్నల ఆశీర్వాదంతో ముగ్గురం అన్నదమ్ములం మంచి పేరు సంపాదించాలనే సదుద్దేశంతోనే ఈ బేనర్‌ స్థాపించాం. మా బ్యానర్లో త్వరలోనే మా తమ్ముణ్ణి హీరోగా లాంచ్‌ చేయబోతున్నాం. అలాగే ఈ మూవీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ చాలా సపోర్ట్‌ చేశారు. మా బేనర్‌కి మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ.. ‘‘మా ధమ్కీ మూవీని బ్లెస్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ ని పరిచయం చేశాను. అందరు మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇది నా రెండో సినిమా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుంకర బ్రదర్స్‌కి థాంక్స్’’ అన్నారు. 

హీరో రజిత్‌ మాట్లాడుతూ.. ‘‘నన్ను బ్లెస్‌ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుంకర బ్రదర్స్‌ ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సినిమా అవుట్‌ ఫుట్‌ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు. 

సుంకర బ్రదర్స్‌ అభిలాష్‌ మాట్లాడుతూ.. ‘‘మా సుంకర బ్రదర్స్‌ బేనర్‌లో ధమ్కీ లాంటి మంచి మంచి మూవీస్‌ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’’ అన్నారు.

 నటీనటులు : రజిత్, త్రిషాలాష, శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  

సాంకేతిక నిపుణులు : 

డి.ఓ.పి.: దీపక్ భగవంత్

సంగీతం: ఎసి.బి ఆనంద్ 

ఎడిటర్: చోట కె ప్రసాద్

లిరిక్స్: శ్రీమణి 

ఫైట్ మాస్టర్: రామ్-లక్ష్మణ్

బ్యానర్: సుంకర బ్రదర్స్

సమర్పణ: శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు

నిర్మాత: సత్యనారాయణ సుంకర

రచన- దర్శకత్వం: ఏనుగంటి

Dhamki Movie Teaser Released:

VV Vinayak Launches Dhamki Movie Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ