Advertisementt

‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ ప్రమోషనల్ సాంగ్ కేక!

Sat 07th Sep 2019 11:52 AM
nani gang leader,promotional song,nani,anirudh ravichander,vikram k kumar  ‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ ప్రమోషనల్ సాంగ్ కేక!
Nani Gang Leader Promotional Song Released ‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ ప్రమోషనల్ సాంగ్ కేక!
Advertisement
Ads by CJ

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్‌ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సీను సిరిగి..సీటులిరిగి..సీటీ కొట్టాలోయి..’  అంటూ సాగే సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ సంద‌డి చేశారు. సినిమాలో ల‌క్ష్మి, శ‌రణ్య‌, హీరోయిన్ ప్రియాంక‌తో పాటు సినిమాలో న‌టించిన చిన్న పాప క్యారెక్ట‌ర్స్ గురించి నాని ఎక్స్‌ప్లెయిన్ చేసేలా ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను అనిరుధ్ డిజైన్ చేశారు.

Click Here for Promotional Song

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani Gang Leader Promotional Song Released:

Nani Gang Leader Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ