Advertisementt

ముద్దుగుమ్మ.. ‘బొద్దు’గుమ్మగా ఎందుకైంది!

Fri 06th Sep 2019 04:39 PM
anushka shetty,weight,anushka,tollywood  ముద్దుగుమ్మ.. ‘బొద్దు’గుమ్మగా ఎందుకైంది!
Anushka Shetty’s Weight ‘Struggle’ Isn’t Shocking, Its Coverage Is... ముద్దుగుమ్మ.. ‘బొద్దు’గుమ్మగా ఎందుకైంది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ నటి అనుష్క గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి.. టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఎదిగింది. ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటికే పలుమార్లు భారీగా లావు పెరిగి మళ్లీ తగ్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా షాకింగ్ లుక్‌లో కనిపించింది. ఈ లుక్‌లో ఈ ముద్దుగుమ్మను చూసిన జనాలంతా ఇదేంటి ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మగా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు. 

అనుష్క ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కింది. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఓ మీడియా ప్రతినిధి తన కెమెరాకు పనిచెప్పాడు. దీంతో ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనుష్క లుక్ అసలు బాగాలేదని.. ఆమె గ్లామరస్‌గా కనిపించట్లేదని.. ఇంకా లావు తగ్గలేదేంటి..? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

అనుష్క.. యోగా టీచర్ అన్న విషయం తెలిసిందే. ఆమెకు లావు తగ్గాలన్నా.. పెరగాలన్నా పెద్ద విషయమేమీ కాదు. అయితే ఈ ముద్దుగుమ్మ కొత్త సినిమా కోసం ఇలా తయారైందా లేకుంటే మరో కారణం ఏమైనా ఉందా..? అని అనుష్క అభిమానులు యోచిస్తున్నారు. మరి బొద్దుగా తయారవ్వడం వెనుక కారణాలేమైనా ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Anushka Shetty’s Weight ‘Struggle’ Isn’t Shocking, Its Coverage Is...:

Anushka Shetty’s Weight ‘Struggle’ Isn’t Shocking, Its Coverage Is

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ