Advertisementt

‘సైరా’ను బయపెడుతున్న ఆ సన్నివేశాలు!

Fri 06th Sep 2019 03:00 PM
sye raa narasimha reddy,sye raa,war shots,megastar chiranjeevi  ‘సైరా’ను బయపెడుతున్న ఆ సన్నివేశాలు!
News About Sye Raa Narasimha Reddy ‘సైరా’ను బయపెడుతున్న ఆ సన్నివేశాలు!
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై పాజిటివ్‌తో పాటు నెగిటివ్ టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సినిమా నిడివి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీంతో పాటు పలు మైనస్‌లు ఉన్నాయ్.. అవన్నీ ఇక్కడ అనవసరం.. అప్రస్తుతం కూడా.

ఇక అసలు విషయానికొస్తే.. సాహో సంగతి అయిపోయింది.. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ విషయానికొస్తే.. నిడివి గురించి దర్శకనిర్మాతల్లో టెన్షన్ మొదలైందట. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి యుద్ధ స‌న్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సన్నివేశాలే ఎక్కువ నిడివి ఉంటాయట. అయితే ఇవి సినిమాకు ప్లస్ అవుతాయా..? మైనస్ అవుతాయా..? అసలు ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు, అభిమానులు సీట్లలో కూర్చుంటారా..? లేదా అన్నది ప్రస్తుతం చిత్రబృందాన్ని వెంటాడుతున్న ఏకైక ప్రశ్న.

మరోవైపు బాలీవుడ్ మొదలుకుని అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి దర్శకనిర్మాతలకు పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ‘నిడివి’ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారట. అయితే ఈ నిడివి సినిమాకు ప్లస్ అవుతుందా లేకుంటే మైనస్ అవుతుందా..? మరి ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు అభిమానుల మనసును చూరగొంటాయా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.

News About Sye Raa Narasimha Reddy:

News About Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ