Advertisementt

చిరు, కొరటాల మూవీలో ఊహించని హీరోయిన్!

Fri 06th Sep 2019 02:49 PM
ileana,opposite,chiranjeevi,koratala shiva movie,sye raa  చిరు, కొరటాల మూవీలో ఊహించని హీరోయిన్!
Unexpected Heroine for Chiranjeevi? చిరు, కొరటాల మూవీలో ఊహించని హీరోయిన్!
Advertisement
Ads by CJ

సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో చిరు డ్యూయల్ పాత్ర పోషించనున్నారు. అందుకుగాను చిరు కోసం కొరటాల టీం ఇద్దరు హీరోయిన్స్ ని వెతికే పనిలో పడింది. నయనతార చిరుతో నటించే అవకాశముందని అర్ధం అవుతుంది. సైరా తరువాత మరోసారి నయన్.. చిరుతో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుందట. అలానే మరో హీరోయిన్ గా అలనాటి సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించే అవకాశం ఉందని ఆమధ్య వార్తలు వచ్చాయి. 

అయితే ఇప్పుడు తాజాగా చిరు సరసన గోవా బ్యూటీ ఇలియానాకు ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ప్రియుడుతో విడిపోయి సినిమా అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న టైములో టాలీవుడ్ నుండి ఛాన్స్ వచ్చింది. చిరు పక్కన నోటెడ్ హీరోయిన్స్ నే తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు కొరటాల టీం. అయితే వీటిపై అధికార ప్రకటన రావాల్సిఉంది. నవంబర్‌లో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Unexpected Heroine for Chiranjeevi?:

Ileana Opposite Chiranjeevi?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ