Advertisementt

బాల‌కృష్ణ 105వ చిత్రం రెండో షెడ్యూల్ స్టార్ట్స్!

Fri 06th Sep 2019 01:30 PM
nbk 105th,second schedule,balakrishna,rfc  బాల‌కృష్ణ 105వ చిత్రం రెండో షెడ్యూల్ స్టార్ట్స్!
Balayya 105th film Latest Update బాల‌కృష్ణ 105వ చిత్రం రెండో షెడ్యూల్ స్టార్ట్స్!
Advertisement

హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘జైసింహా’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ నేటి నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి ఆధ్వ‌ర్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. 

భారీ అంచ‌నాల న‌డుమ రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి, పోస్ట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Balayya 105th film Latest Update:

NBK 105th Film second schedule Starts

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement