ఓ బేబీ మూవీ హిట్ అందుకున్న సమంతకు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ నిర్మించిన నిర్మాతలకు 20 కోట్లు దాకా లాభం వచ్చింది. అంటే సామ్ తో సినిమా తీస్తే కచ్చితంగా 20 కోట్లు లాభం వస్తుందని సమంతతో సినిమా తీద్దామని పలువురు నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. వీరిలో పెద్ద, చిన్న... డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ సామ్ మాత్రం వారిలో ఎవరితోను పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కారణం తనకు కథలు నచ్చకపోవడం. ఆమెకు ప్రస్తుతం ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి కథలు కావాలని, ఆషామాషీ పాత్రలయితే తాను ఆల్రెడీ చాలానే చేసానని అంటోందట.
ఒకవేళ ఆమె వద్దకు అటువంటి కథలు తీసుకెళ్లినా హీరోయిన్ పాత్ర ఇలా ఉంటే బెటర్, వెరైటీగా ట్రై చేయండి అని చెబుతుండడంతో ఆమెతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావడంలేదట. ఎంత మంది డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ పంపినా, ఎన్ని కథలు వినిపించినా రిజెక్ట్ చేస్తూనే ఉందట. సామ్ తో సినిమా తీయడం కన్న నాలుగైదు సినిమాలు తీసుకుని అదృష్టం పరీక్షించుకోవచ్చు అని నిర్మాతలు దండం పెట్టేస్తున్నారట. అందుకే సామ్ ప్రస్తుతం ఏమి సినిమాలు చేయడంలేదు.