రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రాజమౌళితో పాటు ఎన్టీఆర్ రీసెంట్‌గా బల్గేరియాకి వెళ్లారు. అక్కడ తారక్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించనున్నారు. 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రకరించనున్నారు. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ తరువాత షెడ్యూల్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ఈమూవీ కోసం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ నాలుగు భాషలను నేర్చుకుంటున్నాడట. తన వాయిస్‌ని వేరే ఎవరు చెప్పకూడదని అలా చెబితే పాత్రకి న్యాయం జరగదు అని తారక్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇందులో తారక్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందుకు గాను ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. వచ్చే ఏడాది 2020, జులై 30న ఈమూవీ రిలీజ్ కానుంది.