Advertisementt

‘సాహో’కు అసలు పరీక్ష స్టార్ట్!!

Thu 05th Sep 2019 03:21 PM
saaaho,prabhas,shradda kapoor,tollywood  ‘సాహో’కు అసలు పరీక్ష స్టార్ట్!!
News About Saaaho ‘సాహో’కు అసలు పరీక్ష స్టార్ట్!!
Advertisement
Ads by CJ

అబ్బో సినిమా మాములుగా ఉండదు. విజువల్ వండర్ అని, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి అని, హాలీవుడ్ కి దీటు గా ఈ మూవీ ఉండబోతుందని, కలెక్షన్స్ బాహుబలి కలెక్షన్స్ కి దగ్గరలో వస్తాయని చాలానే చెప్పారు సాహో టీం. ప్రభాస్ కూడా ఈచిత్ర ప్రమోషన్ కోసం బాగానే కష్టపడ్డారు. వరసగా నాలుగు రోజులు సెలవలు రావడం ఈమూవీ బాగా ప్లస్ అయింది. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ చాలా చోట్ల స్ట్రాంగ్ గానే ఉన్నాయి.

కానీ సాహో చిత్రం కి అసలు పరీక్షా మంగళవారం నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ డ్రాప్‌ ఛాయలు సోమవారం సాయంత్రం షోల్లోనే క్లియర్‌గా తెలుస్తోంది. మంగళవారం బుకింగ్స్‌ చూసినా కానీ బ్లాక్‌బస్టర్‌ సినిమా సందడి లేనే లేదనేది కూడా సుస్పష్టమే. నాలుగు రోజులు కలెక్షన్స్ బాగున్నాయి అనుకున్న ఇంకా ఈమూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే చాలా కావాలి. మరి సాహో టీం ఏం చేస్తుందో చూడాలి. ప్రభాస్ ఈసినిమా ని ప్రమోట్ చేయడం కోసం తన హాలిడే ట్రిప్ ని సగంలోనే వదిలేసి వచ్చాడు అని చెబుతున్నారు. ఏదిఏమైనా మరి కొన్ని గంటల్లో ఈ సినిమా భవిషత్తు ఏంటో తెలిసిపోతుంది.

News About Saaaho:

News About Saaaho

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ