ఆగస్టు 30 న వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయినా ప్రభాస్ సాహో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన రోజు రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రెండు రోజుల్లో ఈమూవీ వరల్డ్ వైడ్ గా 205 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. మిగిలిన రాష్ట్రాలు పక్కన పెడితే ఏపీ, తెలంగాణాల్లోని అనేక ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక మొదటి రోజు ఈచిత్రం రూ. 42 కోట్ల షేర్, నైజాంలో రెండు రోజుల్లో రూ.14.42 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల సాహో చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే స్థాయిలో రిలీజ్ అవుతున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా. దీనిపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది కచ్చితంగా సాహో రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని డిస్కషన్స్ ఇప్పటి నుండే మొదలయ్యాయి.
మెగా ఫ్యాన్స్ మాత్రం సైరా చిత్రం బాహుబలి రేంజ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని నమ్ముతున్నారు. భారీ అంచనాలు మధ్య ఈమూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.