బాహుబలి తో భారీ అంచనాలు నెలకొల్పిన ప్రభాస్ అంటే ఇండియా ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. కేవలం తమిళ్, మలయాళం, మాత్రమే కాదు హిందీ లో ప్రభాస్ బాహుబలి కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. అందుకే ధైర్యంగా ప్రభాస్ సాహో లాంటి మూవీ చేసాడు. కానీ ప్రభాస్ సాహో కి నెగెటివ్ టాక్ రావడంతో... ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారని అందరూ అనుకుంటున్నారు కానీ.. సాహో వసూళ్లు చూస్తే ప్రేక్షకులు ప్రభాస్ సాహోని పిచ్చగా ఆదరిస్తున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న సాహో మీద బాలీవుడ్ క్రిటిక్స్, ప్రముఖులు కత్తి కట్టారు. సినిమా పోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే సాహో కి నెగిటివ్ టాక్ రాగానే తొక్కెయ్యాలనే ప్లాన్ తో... మరీ 1.5 రేటింగ్ ఇచ్చారు. మీడియాలో సాహో పై నెగెటివ్ ప్రచారము చేశారు.
కానీ వాళ్ళెంత చేసినా బాలీవుడ్ లో సాహో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి అంటే ప్రభాస్ క్రేజ్ హిందీ లో ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన సాహో.. హిందీ లో రెండో రోజు, మూడో రోజు అదే ఊపు కంటిన్యూ చేసింది అంటే.. ప్రభాస్ క్రేజ్ హిందీ లో ఎలా ఉందో అర్ధమవుతుంది. సాహో కొచ్చిన టాక్ తో సినిమాకి వారాంతానికి 50 కొట్లోచ్చినా ఎక్కువే అనుకుంటే.. కేవలం ఫస్ట్ వీకండ్ లోనే సాహో 70 కోట్లు కొల్లగొట్టేయ్యడం ఖాయమైంది. మరి బాలీవుడ్ వాళ్ళు పనికట్టుకుని కిల్ చేద్దామనుకున్న సాహో కి ఆ రేంజ్ కలెక్షన్ రావడంతో ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అదే సాహో హిట్ టాక్ పడితే.. ప్రభాస్ క్రేజ్ తో ఈ ఏడాది బాలీవుడ్ మూవీస్ కలెక్షన్స్ అన్ని సాహో తుడిచి పెట్టేసేది.