Advertisementt

‘సాహో’ ఎఫెక్ట్: ‘సైరా’ యూనిట్‌లో టెన్షన్!

Tue 03rd Sep 2019 02:45 AM
sye raa,saaho,saaho result,tension,bollywood,mega star,chiranjeevi,prabhas,ram charan  ‘సాహో’ ఎఫెక్ట్: ‘సైరా’ యూనిట్‌లో టెన్షన్!
Saaho Effect: Tension in Sye Raa Unit ‘సాహో’ ఎఫెక్ట్: ‘సైరా’ యూనిట్‌లో టెన్షన్!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమాల చూపు.. నేషనల్ వైడ్‌గా పడింది. అందుకే భారీ బడ్జెట్‌లతో ఇండియాలోని పలు భాషల్లో సినిమాలను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. అందులో మొదటగా సాహో సినిమా తెరకెక్కింది. నాలుగు భాషల్లో భారీగా తెరకెక్కిన సాహో సినిమా తాజాగా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో ప్రభాస్ పక్కా ప్లానింగ్ తో సాహో సినిమాని భారీగా తెరకెక్కించి, నాలుగు భాషల్లో ప్రమోట్ చేసి మరీ విడుదల చేసాడు. అలాగే ఇండియాలోనే అతి పెద్ద మార్కెట్ బాలీవుడ్ ని టార్గెట్ చేసి మరీ.. అక్కడ నటులతోనే సినిమాని తీశారు. కానీ సాహో సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవటంతో ఇప్పుడు నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. సాహో సినిమా టాక్ తో ప్రభాస్ మార్కెట్ పడిపోతుంది. అలాగే నిర్మాతల నెక్స్ట్ సినిమాలకు భారీ బిజినెస్ జరగడం కష్టం.

ఇక నాలుగు భాషల్లో విడుదలైన సాహో కి వచ్చిన టాక్ తో ఇప్పుడు మరో భారీ సినిమాకి టెన్షన్ పట్టుకుందని సమాచారం. రామ్ చరణ్ తన తండ్రి చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డిని ఇండియాలోని ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. మరి ఎంత ప్లానింగ్ తో సినిమా నిర్మించినా... పక్కా ప్రమోషన్స్ ఉన్నప్పటికీ.... సినిమా టాక్ తేడా కొడితే చాలా నష్టమే జరుగుతుంది. 

మరి భారీగా తెరకెక్కించిన సాహో సినిమాకి నెగెటివ్ టాక్ చాలా త్వరగా స్ప్రెడ్ అయ్యింది. మరి సై రా విషయంలో టాక్ తేడా కొట్టినా.. టాక్ త్వరగా స్ప్రెడ్ అవకూడదని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ తో సై రా మీద భారీ అంచనాలున్నాయి. మరి సాహోలా కాకుండా సై రా అయినా అనుకున్న అంచనాలు అందుకోవాలని ఆశిద్దాం.

Saaho Effect: Tension in Sye Raa Unit:

Sye Raa Team Unhappy with Saaho Result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ